Share News

వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:17 AM

ప్రభుత్వం సీహెచసీ గ్రూపుల ద్వారా అందించిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రబృందం సభ్యులు సూచించారు.

వ్యవసాయ పరికరాలను వినియోగించుకోవాలి
Central team inspecting the sprinklers

చెన్నేకొత్తపల్లి, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సీహెచసీ గ్రూపుల ద్వారా అందించిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్రబృందం సభ్యులు సూచించారు. మండలంలోని ప్యాదిండి గ్రామాన్ని కేంద్ర బృందం సభ్యులు మెకనైజేషన అండ్‌టెక్నాలజీ జాయింట్‌ సెక్రటరీ ఎస్‌.రుక్మాణి, డిప్యూటీ కమిషనర్‌ సీఆర్‌ లోహి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఫార్మర్‌ వెల్ఫేర్‌ మంగళపాండే శనివారం సందర్శించారు. వ్యవసాయ యాంత్రీకణ పరికరాలైన ట్రాక్టర్‌, ఐదు మడకలు, 42 బ్లేడుల రోటావేటర్‌, సబ్సిడీపై అందించిన డ్రోన్లను వారు పరిశీలించారు. రైతులతో వాటిని ఉయోగించే తీరును అడిగి తెలుసుకున్నారు. వేరుశనగ పంటను పరిశీలించి సాగు పద్ధతులు, దిగుబడులు, డ్రిప్‌, స్ర్పింక్లర్ల అవసరాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, ఏడీఏ లక్ష్మానాయక్‌, ఏవో మురళీకృష్ణ, టీడీపీ మండల కన్వీనర్‌ ముత్యాల్‌రెడ్డి, రైతుసేవా కేంద్రం సిబ్బంది రామ్మోహనరెడ్డి, శ్రీలత, చందన, అనిత, నవ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 12:17 AM