Share News

మహిళా రిజర్వేషన బిల్లు తీసుకురావాలి

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:47 PM

ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని ఏపీ మహిళా సమాఖ్య నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌వద్ద వారు నిరసన తెలిపారు.

మహిళా రిజర్వేషన బిల్లు తీసుకురావాలి
Women’s Association members protesting at the Collectorate

అనంతపురం విద్య, జూన8(ఆంధ్రజ్యోతి): ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని ఏపీ మహిళా సమాఖ్య నేతలు డిమాండ్‌ చేశారు. సోమవారం కలెక్టరేట్‌వద్ద వారు నిరసన తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మావతి మాట్లాడుతూ డీలిమిలేషనకు సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలన్నారు. కేంద్రం బిల్లు ముసుగులో మరోకుట్రను ముందుకు తీసుకురావడం వల్లనే పార్లమెంట్‌లో వీగిపోయిందన్నారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు వనతిపత్రం అందజేశారు. కమ్మక్క, లక్ష్మీదేవి, యశోదమ్మ, పద్మ, కుళ్లాయమ్మ, పద్మ, సత్యమ్మ, అరుణ, ఓబులమ్మ, స్వాతి పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2026 | 11:48 PM