Share News

సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి

ABN , Publish Date - Jun 05 , 2026 | 11:58 PM

సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని పలు ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా కలిశాయి.

సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలి
Telugunadu Teachers' Association leaders submitting a petition to the MLC

అనంతపురం విద్య, జూన 5(ఆంధ్రజ్యోతి): సర్వీస్‌ టీచర్లకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేశాయి. శుక్రవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని పలు ఉపాధ్యాయ సంఘాలు వేర్వేరుగా కలిశాయి. టీఎనటీయూసీ జిల్లా అధ్యక్షుడు జయపాల్‌నాయుడు, రామలింగప్ప, ప్రకాష్‌, నరసింహులు, ఈశ్వరయ్య, రమణప్రసాద్‌, వెంకటేష్‌, భాస్కర్‌ ఎమ్మెల్సీని కలిశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఫణిభూషణ్‌, చంద్రశేఖరరావు, శ్రీనివాసులు, కుళ్లాయప్ప, ఆప్టా జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, నారాయణ, చల్లాశివానంద, మురళీధర్‌, నాగేంద్ర, సూర్యనారాయణ కలిశారు. అలాగే నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన(ఎనటీఏ) నాయకులు ఎమ్మెల్సీని కలిశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు పతకమూరి శ్రీనివాసులు, రవి, గోవిందు, నరేష్‌ ఎమ్మల్సీని కలిసిన వారిలో ఉన్నారు. నాయకులు మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం రాకముందే డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా 30 ఏళ్లపాటు పనిచేసిన టీచర్లకు టెట్‌ అర్హత పరీక్షలు పెట్టడం సరికాదన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చట్టణ సవరణ చేయడం, లేదా ఉత్తీర్ణత శాతం తగ్గించాలని వారు ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jun 05 , 2026 | 11:58 PM