Share News

SKU: పీజీ నాలుగో సెమిస్టర్‌ ఫీజులు రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:03 AM

స్కేయూ పరిధిలోని పీజీ నాల్గవ సెమిస్టర్‌ ఫీజులు రద్దు చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం ఎస్కేయూలోని పరీక్షల విభాగాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు.

SKU: పీజీ నాలుగో సెమిస్టర్‌ ఫీజులు రద్దు చేయాలి
Leaders protesting in front of the examination department

అనంతపురం ఉన్నత విద్య, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ఎస్కేయూ పరిధిలోని పీజీ నాల్గవ సెమిస్టర్‌ ఫీజులు రద్దు చేయాలని ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. గురువారం ఎస్కేయూలోని పరీక్షల విభాగాన్ని విద్యార్థి సంఘాల నాయకులు ముట్టడించారు. అనంతరం పరిపాలన భవనంలో వీసీ చాంబర్‌ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ వర్సిటీ అధ్యక్షుడు పవన, ఏఐఎ్‌సఎఫ్‌ కార్యదర్శి ఉమామహేష్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే భారంగా ఉన్న పరిస్థితుల్లో వారిపై ఫీజుల భారం మోపడం దారుణమన్నారు. పీజీ నాలుగో సెమిస్టర్‌ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ పేరుతో వివిధ ప్రాంతాలకు వెళ్లిపోతారన్నారు. ప్రాజెక్టు వర్కులు పూర్తీ చేసేందుకు చేతినుంచి రూ.10 నుంచి 15వేలు ఖర్చు పెట్టుకుంటున్నారన్నారు. ఇది చాలదన్నట్లు నాల్గవ సెమిస్టర్‌ విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు పెట్టకుండా కేవలం ప్రాజెక్ట్‌కు మార్కులు వేసేందుకకు ఫీజులు వసూలు చేయడం బాధాకరమన్నారు. వీసీ స్పందిస్తూ ప్రస్తుతం విద్యాసంవత్సరం ముగుస్తోందన్నారు. ఇప్పుడు ఏం చేయలేమని... వచ్చే విద్యాసంవత్సరం ఆలోచిస్తామని సర్ది చెప్పారు. నాగేంద్ర, ఓబులేసు, మల్లేష్‌, రాహుల్‌, అంజి, వీరాంజి, కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 12:03 AM