Share News

దొంగ ఓట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?.. వైసీపీపై మంత్రి ఆనం ఫైర్

ABN , Publish Date - Nov 06 , 2026 | 01:23 PM

నెల్లూరులో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దొంగ ఓట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?.. వైసీపీపై మంత్రి ఆనం ఫైర్
Anam Ramanarayana Reddy

నెల్లూరు, నవంబర్ 6: స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తోందని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు.

నెల్లూరులో ఓసీ మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించడమే టీడీపీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.12,400 కోట్ల నిధుల కేటాయింపులు జరిగాయని, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వైసీపీ హయాంలో నామినేషన్ల సమయంలోనే అభ్యర్థులను బెదిరించేవారని, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరులో వైసీపీ పది వార్డులు గెలుచుకున్నా తాము అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు.


అనంతసాగరం పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు వేయించారని.. మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి వందమంది అనుచరులతో వచ్చి బూత్ క్యాప్చర్‌కు ప్రయత్నించారని ఆనం ఆరోపించారు. దొంగ ఓట్లు వేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ ప్రశ్నించారు. తన అనుభవాన్ని తక్కువ అంచనా వేయొద్దని.. సుప్రీంకోర్టుకు లాగుతాననే హెచ్చరికలకు భయపడనని విక్రమ్ రెడ్డిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సంయమనంతో వ్యవహరిస్తున్నానని, తన సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని హెచ్చరించారు.


ఈ వార్తలనూ చదవండి:

రిటైర్డ్‌ ప్రొఫెసర్‌కు రూ.50 లక్షల టోకరా.. ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ మోసం

వయసు 27, క్రిమినల్‌ కేసులు 59

Updated Date - Nov 06 , 2026 | 02:02 PM