Share News

ఆటోను ఢీకొన్న అంబులెన్సు

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:44 AM

తీర్థయాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. భక్తుల ఆటోను అంబులెన్స్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఐదుగురు మహిళలు గాయపడ్డారు. బాధితులంతా తెలంగాణకు చెందినవారుగా గుర్తించారు.

ఆటోను ఢీకొన్న అంబులెన్సు

  • ఇద్దరు మహిళల దుర్మరణం..

  • అన్నవరం నుంచి లోవ వెళ్తుండగా ఘటన...

  • బాధితులంతా తెలంగాణ వాసులు

తునిరూరల్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): తీర్థయాత్రలో పెను విషాదం చోటుచేసుకుంది. భక్తుల ఆటోను అంబులెన్స్‌ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఐదుగురు మహిళలు గాయపడ్డారు. బాధితులంతా తెలంగాణకు చెందినవారుగా గుర్తించారు. తుని రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లా సదాశివనగర్‌ మండలానికి చెందిన 17మంది భక్తులు మూడు ఆటోల్లో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం అక్కడికి దగ్గరలోని లోవ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు బయలుదేరారు. వీరిలో మూడో ఆటో అన్నవరం-తుని జాతీయ రహదారి మధ్యలోని తేటగుంట వద్ద బంకులో డీజిల్‌ పోయించుకుని రోడ్డుపైకి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన అంబులెన్స్‌ ఢీ కొట్టింది. ప్రమాదంలో కుమ్మరి రాజమణి (60) అక్కడికక్కడే మృతి చెందగా, చికిత్స పొందుతూ సిండే శారద (57) మృతి చెందారు. మరో ఐదుగురు తుని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంబులెన్స్‌ కాలువలోకి జారిపోగా, అందులోని డయాలసిస్‌ రోగిని సురక్షితంగా బయటకు తీసి మరో అంబులెన్స్‌లో విశాఖపట్నానికి తరలించారు.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:44 AM