Share News

అమరావతిని ప్రపంచ స్థాయి మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Aug 26 , 2026 | 09:44 PM

ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ అన్నారు. రేపటి తరం గర్వపడేలా అమరావతిని ప్రపంచం గుర్తించే మోడల్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు..

అమరావతిని ప్రపంచ స్థాయి మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్
Amaravati Global Model City

అమరావతి, ఆగస్టు 26: అమరావతిని ప్రపంచ స్థాయి మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖకు తాను సంరక్షకుడిని మాత్రమేనని, తనకు అప్పగించిన బాధ్యతలను మరింత మెరుగైన స్థితికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వివరిస్తూ ‘స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ’ తమ విజయ రహస్యాలని పేర్కొన్నారు. వేగవంతమైన నిర్ణయాలు, మెరుగైన సేవలు, స్థిరమైన విధానాలతో ఏపీని పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రేపటి తరం గర్వపడేలా అమరావతి చరిత్ర సృష్టించబోతోందని, ప్రపంచమంతా చెప్పుకునేలా ఆంధ్రప్రదేశ్‌లో ఒక మోడల్‌ను సృష్టించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.


ఇదిలా ఉండగా.. ‘ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40’ అవార్డును నారా బ్రాహ్మణి అందుకున్నారు. కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ చేతుల మీదుగా ఆమె ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వీకరించారు. యువ నాయకత్వం, వ్యాపార రంగంలో ప్రతిభ, సంస్థల అభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 జాబితాలో ఆమెకు చోటు దక్కింది. అవార్డు అందుకున్న సందర్భంగా బ్రాహ్మణికి పలువురు అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు అవకాశాల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఈ అవార్డు ప్రాధాన్యత సంతరించుకుంది.


Also Read:

ప్రెషర్‌ కుక్కర్‌ విజిల్‌ వేస్తూ నీరు కారుతోందా? ఈ సింపుల్‌ చిట్కాలతో సమస్యకు చెక్‌

దానం చేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయొద్దు

Updated Date - Aug 26 , 2026 | 09:49 PM