Share News

క్వాంటం వ్యాలీ ట్విన్‌ టవర్స్‌కు శంకుస్థాపన

ABN , Publish Date - Oct 14 , 2026 | 04:53 AM

అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ అభిషేక్‌కుమార్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయనిపాలెంలో ..

క్వాంటం వ్యాలీ ట్విన్‌ టవర్స్‌కు శంకుస్థాపన

తుళ్లూరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్‌ టవర్స్‌ నిర్మాణానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, సీఆర్డీఏ అదనపు కమిషనర్‌ అభిషేక్‌కుమార్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయనిపాలెంలో వీటిని నిర్మిస్తున్నారు. 50 ఎకరాల క్వాంటం వ్యాలీలో మొత్తం 8 టవర్లు నిర్మించనున్నట్టు మంత్రి చెప్పారు. ట్విన్‌ టవర్లను 11 ఎకరాల్లో 37,48,847 చ.అ. విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎల్‌అండ్‌టీ సంస్థ వీటిని నిర్మిస్తోందన్నారు.

బహుళ ఆప్షన్లు ఒకేసారి తీసుకుని పని చేయడమే క్వాంటం వ్యాలీ కంప్యూటర్‌ ప్రత్యేకత అని చెప్పారు. అనుకున్న సమయానికి నిర్మాణాలు పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తామని వివరించారు. ట్విన్‌ టవర్ల నిర్మాణం పూర్తయితే, వాటిలో 25 వేల మంది ఉద్యోగాలు చేస్తారన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతికతతో ఇక్కడి నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. రాజధాని రైతులు ట్విన్‌ టవర్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని నవధాన్యాలు వేశారు.

ఈ వార్తలనూ చదవండి:

కొత్త డీఎస్సీలో 290 పోస్టులు

గిన్నిస్‌ బుక్‌లోకి 75 గంటల డప్పుమోత

Updated Date - Oct 14 , 2026 | 04:54 AM