Share News

ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడిన కూటమి: ఆలపాటి

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:32 AM

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు.

ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడిన కూటమి: ఆలపాటి

అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగులకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ ధన్యవాదాలు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 63.6 శాతం ఉద్యోగులు కూటమికి మద్దతుగా నిలిచారని అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. వైసీపీ రివర్స్‌ పీఆర్సీ తెచ్చి ఉద్యోగుల మధ్యంతర భృతిని 27 నుంచి 23 శాతానికి తగ్గిస్తే... ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి హక్కులను నెరవేరుస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఉద్యోగుల డిమాండ్‌ మేరకు సుమారు 11 వేలమందిని సీపీఎస్‌ నుంచి పాత పెన్షన్‌ విధానంలోకి తీసుకొచ్చిన ఘనత కూటమికి దక్కుతుందన్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులకోసం కూటమి అనుక్షణం తపిస్తోందని అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవల రద్దు

30 ఏళ్లు దాటినా రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫొటో చూడని సోనియా!

Updated Date - Nov 11 , 2026 | 05:34 AM