Share News

అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:57 AM

‘అగ్రిగోల్డ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తాం. ఈసారి అన్ని శాఖల సమన్వయంతో స్టేట్‌ లెవల్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి దారులు వెతుకుతున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం

  • బాధితులంతా బాండ్ల జిరాక్స్‌లు ఇవ్వాలి: మనోహర్‌

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘అగ్రిగోల్డ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తాం. ఈసారి అన్ని శాఖల సమన్వయంతో స్టేట్‌ లెవల్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి దారులు వెతుకుతున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. బుధవారం అగ్రిగోల్డ్‌పై మంత్రుల సబ్‌ కమిటీతో స్టేట్‌ లెవెల్‌ కమిటీ సమావేశం జరిగింది. మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అగ్రిగోల్డ్‌లో పెట్టుబడి పెట్టి బాండ్స్‌ ఉన్నవారు తమ ఒరిజినల్స్‌ను చూపించి జిరాక్స్‌ను ప్రత్యేక బృందాలకు ఇవ్వాలి. ప్రత్యేక బృందాలు వాటిని ధ్రువీకరిస్తాయి. నిషేధిత జాబితా నుంచి భూముల్ని తొలగించేలా చర్యలు తీసుకుంటాం’ అని నాదెండ్ల చెప్పారు.

Updated Date - Sep 24 , 2026 | 05:57 AM