Share News

ఒక వైసీపీ కౌన్సిలర్‌ గెలిచినా రాజకీయాల నుంచి తప్పుకుంటా!

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:44 AM

జమ్మలమడుగు మున్సిపాలిటీలో వైసీపీ పాలెగాళ్లు ఒక్క కౌన్సిలర్‌ సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రభుత్వ విప్‌, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సవాలు విసిరారు.

ఒక వైసీపీ కౌన్సిలర్‌ గెలిచినా రాజకీయాల నుంచి తప్పుకుంటా!

  • రేప్‌ కేసు తప్ప అన్నీ కేసులూ నాపై పెట్టారు: ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

జమ్మలమడుగు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు మున్సిపాలిటీలో వైసీపీ పాలెగాళ్లు ఒక్క కౌన్సిలర్‌ సీటు గెలిచినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రభుత్వ విప్‌, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సవాలు విసిరారు. మంగళవారం జమ్మలమడుగులోని రిపబ్లిక్‌ క్లబ్‌ ఆవరణలో ఉచిత మెగా వైద్యశిబిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మాజీ సీఎం జగన్‌ వంద జన్మలు ఎత్తినా కూటమి ప్రభుత్వాన్ని, సంక్షేమం, అభివృద్ధిని ఢీకొట్టలేడన్నారు. జగన్‌ తనను రకరకాలుగా ఇబ్బంది పెట్టారని, రేప్‌ కేసు తప్ప అన్ని కేసులూ పెట్టారని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:44 AM