క్యాన్సర్‌పై పోరాడదాం!
ABN , Publish Date - Oct 12 , 2026 | 04:27 AM
సమాజంలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జీఎ్‌సఎల్ ఆసుపత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ హెల్త్ కేర్ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు.
ఆరంభంలో గుర్తిస్తే నివారణ సాధ్యం
ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం: చిరంజీవి
కూటమి పాలన బాగుందని కితాబు
కపిలేశ్వరపురం/మండపేట, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): సమాజంలో ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో జీఎ్‌సఎల్ ఆసుపత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ హెల్త్ కేర్ సెంటర్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో క్యాన్సర్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చిన్నపాటి పరీక్షతో దానిని ప్రారంభదశలో గుర్తించడం వల్ల నివారించే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి మహిళా బ్రస్ట్ క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. బాలికలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ రాకుండా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా పెద్ద ముప్పు తప్పించవచ్చని చిరంజీవి తెలిపారు.
రాష్ట్రంలో కూటమి పాలన బాగుందని.. అభివృద్ధి, సంక్షేమం సమంగా ఉందని ఆయన కొనియాడారు. ‘ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం-పర్యావరణాన్ని పరిరక్షిద్దాం’ అని చిరంజీవి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వాడకం మాన వాళికి పెనుముప్పుగా మారిందన్నారు. మారుమూల ప్రాంతమైన కపిలేశ్వరపురంలో అత్యాధునిక వైద్య సౌకర్యాలతో ఆసుపత్రిని ఏర్పాటు చేసి వైద్యసేవలందించడం అభినందనీయమని నిర్వాహకులను ప్రసంసించారు. సూర్య ట్రస్టు వ్యవస్థాపకుడు జీవీబీ.చౌదరి మాట్లాడుతూ తాను పుట్టి పెరిగిన గ్రామంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గతంలో ఎల్‌వీ.ప్రసాద్ కంటి ఆసుపత్రి, ఇప్పుడు హెల్త్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మాజీ ఎంపీ మురళీమోహన్, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వేగుళ్ల జోగేశ్వరరావు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఏఐజీ ఆసుపత్రి ఎండీ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, జీఎ్‌సఎల్ మెడికల్ కాలేజి చైర్మన్ గన్ని భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్