Share News

భవన నిర్మాణంలో ప్రమాదం

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:54 AM

తిరుపతి నగరంలో ఓ హోటల్‌ నిర్మాణ పనుల్లో క్రేన్‌ కిందపడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

భవన నిర్మాణంలో ప్రమాదం

  • క్రేన్‌ కిందపడి ముగ్గురి దుర్మరణం, తిరుపతిలో ఘోరం

తిరుపతి(నేరవిభాగం), సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలో ఓ హోటల్‌ నిర్మాణ పనుల్లో క్రేన్‌ కిందపడి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. నగరంలోని డీబీఆర్‌ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌ పక్కనున్న స్థలంలో అదే సంస్థకు చెందిన నాందీ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ 13 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టింది. స్థలంలోని పెద్ద రావిచెట్టును తొలగించేందుకు మంగళవారం భారీ క్రేన్‌ తీసుకొచ్చారు. చెట్టును పెకలించే క్రమంలో భూమి ఒక్కసారిగా కుంగిపోయి క్రేన్‌ పక్కకు ఒరిగిపోయింది. ఆ ప్రదేశంలోనే పనులు పర్యవేక్షిస్తున్న శ్రీ కన్వెన్షన్స్‌ సివిల్‌ ఇంజనీర్‌ సందీ్‌పరెడ్డి (34), తోటమాలి చెంగయ్య (40), ఒడిశాకు చెందిన కూలీ రామారావు (41) క్రేన్‌ కిందపడి మృతిచెందారు. ప్రమాదంలో బిహార్‌కు చెందిన క్రేన్‌ ఆపరేటర్లు షేక్‌ ఫర్హాన్‌, షేక్‌ నౌసాన్‌ తీవ్రంగా, తమిళనాడుకు చెందిన కూలీ మురుగయ్య స్వల్పంగా గాయపడగా రుయాస్పత్రికి తరలించారు.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 05:54 AM