ABN కథనంపై స్పందిస్తున్న దాతలు.. మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన విద్యార్థినికి ఆర్థికసాయం..
ABN , Publish Date - Jul 25 , 2026 | 09:33 PM
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రభావంతో మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన కందుల జెస్సీ అనే విద్యార్థినికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.
అమరావతి, జులై 25: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రభావంతో మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన కందుల జెస్సీ అనే విద్యార్థినికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కందుల జెస్సీకి సెల్‌ఫోన్, విమాన టికెట్లు, వసతి ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో కుడా ఛైర్మన్ తలాటం సత్య ల్యాప్‌టాప్ అందజేయనున్నారు.
పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించిన జెస్సీ..
పేదరికం ప్రతిభకు అడ్డుకాదని తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కందుల జెస్సీ నిరూపించింది. ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తి శాట్'కు ఎంపికై రికార్డు సృష్టించింది. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో జెస్సీ చోటు దక్కించుకుని.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచింది. 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది బాలికలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా.. పలు దశల ఎంపిక ప్రక్రియ అనంతరం జెస్సీ తుది జాబితాలో స్థానం సంపాదించింది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో విషాదం: పెంట్ హౌజ్ పైనుంచి దూకి యువకుడి బలవన్మరణం
విద్యార్థుల విజయాన్ని మా ఖాతాలో వేసుకోం: సీఎం రేవంత్