Share News

పోలీస్‌ కొలువుల జాతర

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:47 AM

378 ఎస్సై, 1,156 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం (నవంబరు 27) నుంచి మొదలవుతుందని, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబరు 16 అని పేర్కొన్నారు.

పోలీస్‌ కొలువుల జాతర

378 ఎస్సై, 1,156 కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం (నవంబరు 27) నుంచి మొదలవుతుందని, దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ డిసెంబరు 16 అని పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు వయోపరిమితి, అర్హతలు, సిలబస్‌, పరీక్ష ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ పూర్తిగా చదవాలని సూచించారు. సాంకేతిక లేదా సాధారణ సందేహాల నివృత్తి కోసం ఎస్‌ఎల్‌పీఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లోని హెల్ప్‌లైన్‌ నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

మొత్తం ఎస్సై పోస్టులు -378

  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌) (పురుషులు, మహిళలు) - 253

  • రిజర్వ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఏఆర్‌) (పురుషులు, మహిళలు) - 116

  • స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (పురుషులు) - 9

  • మొత్తం కానిస్టేబుల్‌ పోస్టులు - 1,156

  • ఎస్‌సీటీ పీసీ (సివిల్‌) (పురుషులు, మహిళలు) - 542

  • ఎస్‌సీటీ పీసీ (ఏఆర్‌) (పురుషులు, మహిళలు) - 285

  • ఫైర్‌మెన్‌ (స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్‌) - 158

  • వార్డర్స్‌ (పురుషులు) (జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ విభాగం) - 150

  • వార్డర్స్‌ (మహిళలు) (జైళ్లు, కరెక్షనల్‌ సర్వీసెస్‌ విభాగం) - 21


ముఖ్యమైన తేదీలు, పరీక్షల షెడ్యూల్‌

  • ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 27 నుంచి డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

  • పోలీసు కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్ష తేదీ 2027 జనవరి 31. (ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు)

  • ఎస్‌ఐ ప్రాథమిక రాత పరీక్ష 2027 ఫిబ్రవరి 28. పేపర్‌-1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. పేపర్‌-2 మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు

ఎస్సై-పీటీవో, కమ్యూనికేషన్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్స్‌(ఎఫ్‌ఎస్ఎల్), పీసీ (కమ్యూనికేషన్‌), పీసీ (డ్రైవర్‌, మెకానిక్‌ - పీటీవో), డ్రైవర్‌ ఆపరేటర్‌ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌ఎస్) పోస్టుల దరఖాస్తు తేదీలు, ఇతర వివరాలు త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.

Updated Date - Nov 27 , 2026 | 05:58 AM