Share News

26న హెల్త్‌ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు

ABN , Publish Date - Oct 24 , 2026 | 06:23 AM

వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధిలో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలకు ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ వెల్లడించారు.

26న హెల్త్‌ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు

  • ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌

అమరావతి, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య, పరిశోధన, ఆరోగ్య సేవల అభివృద్ధిలో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలకు ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ వెల్లడించారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు విజయవాడలోని బీఆర్‌ ఆంబేద్కర్‌ స్మృతివనం, అంబేడ్కర్‌ కళా వేదికలో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో సాధించిన విజయాలను స్మరించుకోవడంతో పాటు వైద్య విద్యలో నాణ్యతను పెంపొందించడం, పరిశోధనను ప్రోత్సహించడం, ఆధునిక బోధనా విధానాల అభివృద్ధికి మరింత కృషి చేయడమే ఈ వేడుకల లక్ష్యమని వివరించారు. ఈ వేడుకలకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు పాల్గొంటారని వివరించారు.

Updated Date - Oct 24 , 2026 | 06:23 AM