17 పురపాలికలు ఏకగ్రీవం
ABN , Publish Date - Oct 27 , 2026 | 04:09 AM
రాష్ట్రవ్యాప్తంగా 70 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లోను, 13 కార్పొరేషన్లలోను నవంబరు 1న పోలింగ్ జరుగనుంది. 13 కార్పొరేషన్లల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.
మిగతా వాటికి 1న ఎన్నిక: ఎస్‌ఈసీ
మిగతా 70 మున్సిపాలిటీలకే 1న పోలింగ్: ఎస్‌ఈసీ
13 కార్పొరేషన్లకు కూడా..
అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 70 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల్లోను, 13 కార్పొరేషన్లలోను నవంబరు 1న పోలింగ్ జరుగనుంది. 13 కార్పొరేషన్లల్లో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు. అయితే 87 మున్సిపాలిటీల్లో 17.. పిడుగురాళ్ల (షేక్ బాబావలీ-టీడీపీ), గురజాల (నెలవల్లి బొల్లయ్య-టీడీపీ), దాచేపల్లి (తంగెళ్ల శ్రీనివాసరావు-టీడీపీ), కనిగిరి(అచ్చాల తిరుపతమ్మరెడ్డి-టీడీపీ), దర్శి (దారం సుబ్బారావు-జనసేన), నగరి(ఇ.నారాయణ శ్రీనివాసన్), పుంగనూరు (నయీం తాజ్-టీడీపీ), రాయచోటి (బోనుమల ఖాదర్‌వలీ-టీడీపీ), రాజంపేట (దొంతం గాయత్రి-టీడీపీ), ప్రొద్దుటూరు (నంద్యాల రాఘవరెడ్డి-టీడీపీ), బద్వేలు (సోమేశుల దివ్యతేజ-టీడీపీ), మైదుకూరు (ధనపాల జగన్‌మోహన్-టీడీపీ), ఎర్రగుంట్ల (గొర్ల మధులత-బీజేపీ), కమలాపురం (గొంగల్‌రెడ్డి స్వప్న-టీడీపీ), గుత్తి (గోవిందరాజుల తమిళ్‌సెల్వి-టీడీపీ), ఆళ్లగడ్డ (షేక్ అనీషా-టీడీపీ), ఆత్మకూరు (డాక్టర్ ఆవుల గోవిందరాజులు-టీడీపీ) పురపాలక సంఘాల చైర్‌పర్సన్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సోమవారం ప్రకటించింది. కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. వాటి వివరాల జాబితాను కూడా విడుదల చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడిన ‘అర్నబ్’
అతి తీవ్ర తుఫాను..ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్