Share News

ఎదుగుదల లేని బిడ్డతో ఎన్ని కష్టాలో?!

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:33 AM

తండ్రి ఒడిలో ఒదిగ్గా ఉన్న ఈ చిన్నారిని చూశారా.. ముద్దొస్తోంది కదా! వయసు రెండుమూడేళ్లు ఉంటాయనుకుంటుటే తప్పులో కాలేసినట్లే!.. ఆ పాప వయసు అక్షరాల 13 సంవత్సరాలు. పేరు గంటా కీర్తి. తండ్రి గంటా వాసుదేవరావు.

 ఎదుగుదల లేని బిడ్డతో ఎన్ని కష్టాలో?!

  • పెన్షన్‌ కోసం అర్జీలు ఇస్తున్నా స్పందించని అధికారులు

నెల్లూరు(హరనాథపురం), అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తండ్రి ఒడిలో ఒదిగ్గా ఉన్న ఈ చిన్నారిని చూశారా.. ముద్దొస్తోంది కదా! వయసు రెండుమూడేళ్లు ఉంటాయనుకుంటుటే తప్పులో కాలేసినట్లే!.. ఆ పాప వయసు అక్షరాల 13 సంవత్సరాలు. పేరు గంటా కీర్తి. తండ్రి గంటా వాసుదేవరావు. నెల్లూరు జిల్లాలో కలువాయి సొంతూరు. ఎరుకుల సామాజిక వర్గానికి చెందినవారు. చిన్ననాటి నుంచి వయసు పెరుగుతున్నా, శారీరక ఎదుగుదల మాత్రం లేదు. తండ్రి కూలిపనులు చేసి సంపాదించిన దాంట్లోనే కీర్తి వైద్య ఖర్చులకు, డాక్టర్లకు చూపిస్తుంటారు. దివ్యాంగుల కోటాలో తన బిడ్డకు పెన్షన్‌ ఇప్పించి ఆదుకోవాలని వాసుదేవరావు ఇప్పటికి పది సార్లు కలెక్టరేట్‌ చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చాడు. కీర్తికి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్లను డీఆర్‌డీఏ ద్వారా సెర్ప్‌కు అప్‌లోడ్‌ చేశామని తెలిపారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ పింఛన్లు విడుదల చేశాకనే పెన్షన్‌ అందే అవకాశం ఉంటుందని కలువాయి మండల అధికారులు చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్

ఏపీలో నాలుగు కొత్త పోలీస్‌ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం

Updated Date - Oct 06 , 2026 | 06:33 AM