11 నుంచి దసరా మహోత్సవాలు
ABN , Publish Date - Oct 03 , 2026 | 04:54 AM
దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
వివిధ అలంకారాలలో దర్శనమివ్వనున్న అమ్మవారు
ఇంద్రకీలాద్రి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వీకే శీనానాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈనెల 11న బాలాత్రిపురసుందరీదేవిగా, 12న గాయత్రీదేవి, 13న అన్నపూర్ణా దేవి, 14న మహాచండీదేవి, 15న లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. 16న సరస్వతీ దేవి (మూలా నక్షత్రం), 17న మహాలక్ష్మీ దేవి, 18న దుర్గాదేవి, 19న మహిషాసురమర్దినీ దేవి, 20న రాజరాజేశ్వరీ దేవి అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల ప్రారంభం మొదటి రోజు ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు. మిగిలిన రోజులలో తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు