Share News

10 దరఖాస్తులు వస్తేనే లాటరీ!

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:39 AM

ప్రస్తుత ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం ఓ మద్యం షాపునకు 4 దరఖాస్తులు వస్తే లాటరీ తీసే విధానం ఉంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని మద్యం షాపుల రెన్యువల్‌కు కొందరు యజమానులు ముందుకు రావడం లేదు.

10 దరఖాస్తులు వస్తేనే లాటరీ!

  • మద్యం షాపుల కేటాయింపుపై ఎక్సైజ్‌ శాఖ యోచన

  • రెన్యువల్‌ గడువు రేపటి వరకు పొడిగింపు

అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఎక్సైజ్‌ పాలసీ ప్రకారం ఓ మద్యం షాపునకు 4 దరఖాస్తులు వస్తే లాటరీ తీసే విధానం ఉంది. అయితే దీన్ని ఆసరాగా తీసుకుని మద్యం షాపుల రెన్యువల్‌కు కొందరు యజమానులు ముందుకు రావడం లేదు. దీంతో ఓ మద్యం షాపు కేటాయింపునకు కనీస దరఖాస్తుల సంఖ్య 10కి పెంచాలని, అప్పుడే లాటరీ తీయాలని ఎక్సైజ్‌ శాఖ యోచిస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఎక్సైజ్‌ సంవత్సరానికి సంబంధించి ఏ4 మద్యం షాపుల రెన్యువల్‌ గడువును యజమానుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజులు పొడిగించింది. షాపుల నిర్ణీత రెన్యువల్‌, దరఖాస్తు రుసుములను చెల్లించడానికి బుధవారం (23వ తేదీ) వరకు అవకాశం కల్పించింది. సోమవారం నాటికి తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,650 ఏ4 షాపులను నోటిఫై చేశారు. రెన్యువల్‌, దరఖాస్తు రుసుముల కింద మొత్తం రూ.933.44 కోట్ల డిమాండ్‌ ఉండగా, రూ. 676 కోట్లు వసూలైంది. ఇంకా రూ.257 కోట్లు వసూలు కావాల్సి ఉంది. వార్షిక ఆర్‌ఈటీ కంపోనెంట్‌ కింద రూ.2,454.76 కోట్ల డిమాండ్‌ ఉండగా, ఇప్పటి వరకు రూ.441 కోట్లు మాత్రమే వసూలైంది. అలాగే పర్మిట్‌ రూమ్‌ ఆర్‌ఈటీ డిమాండ్‌ రూ.249.15 కోట్లు ఉండగా, రూ.62 కోట్లు మాత్రమే వచ్చింది. ఇలా అన్ని కలిపి మొత్తం వార్షిక డిమాండ్‌ రూ.3,637.35 కోట్లుగా ఉంది. ఇందులో సోమవారం సాయంత్రానికి రూ.1,179.63 కోట్లు వసూలైంది.

ఈ వార్తలనూ చదవండి....

‘హామీల అమలుకు చర్యలు తీసుకోండి’

ఆర్‌వీ నగర్‌ కాఫీ పరిశోధన స్థానం స్వర్ణోత్సవాలకు సీఎం రాక

Updated Date - Sep 22 , 2026 | 05:39 AM