Share News

పిడుగుపాటుకు నలుగురు బలి

ABN , Publish Date - Sep 14 , 2026 | 04:05 AM

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో శనివారం రాత్రి పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

పిడుగుపాటుకు నలుగురు బలి

  • నరసరావుపేటలో వర్ష బీభత్సం

  • సీఎం చంద్రబాబు విచారం

నరసరావుపేట రూరల్‌, అమరావతి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో శనివారం రాత్రి పిడుగులు పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పెట్లూరివారిపాలెంలో పిడుగుపాటుకు కల్పతోటి నాగమ్మ(52), రాంచి సంపూర్ణం(50) మృతి చెందారు. ఎక్కలవారిపాలెంలో మజ్జిగ చిన్నకోటేశ్వరరావు(45), పాలపాడు లో డేరంగుల వెంకటయ్య(56) పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఈ వార్తలనూ చదవండి..

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: కలిశెట్టి

‘డీఎస్సీపై చర్చకు జగన్‌ సిద్ధమా?’

Updated Date - Sep 14 , 2026 | 04:05 AM