ఐఎస్ఏ ద్వారా యువతకు ఆధునిక వ్యవసాయ విద్య
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:36 AM
వ్యవసాయ రంగా న్ని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ.. యువతలో వ్యవసాయ నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా మదనపల్లెలో ఐఎస్ఏ ఏర్పాటవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
ఐఎస్ఏ ద్వారా యువతకు ఆధునిక వ్యవసాయ విద్య
హార్టికల్చర్ హబ్‌తో ప్రపంచ మార్కెట్లకు మార్గం: మాధవ్
వ్యవసాయ రంగా న్ని ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేస్తూ.. యువతలో వ్యవసాయ నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా మదనపల్లెలో ఐఎస్ఏ ఏర్పాటవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. జీహెచ్‌హెచ్, ఐఎ్‌సఏ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో దేశంలోనే తొలిసారిగా ఐఎస్‌బీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు గాంధీ జయంతి రోజున రాయలసీమలో ఐఎస్‌ఏకి శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాయలసీమను దేశ ఆర్థిక అభివృద్ధిలో కీలకమైన ‘పవర్ హౌస్ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నారని ప్రశంసించారు. ఇటీవల ప్రధాని ‘మన్ కీ బాత్’లో రాయలసీమకు చెందిన యువ రైతు వాసుదేవరెడ్డి గురించి ప్రస్తావించారని గుర్తుచేశారు. చీనీ పంట పండే భూమిలో అవకాడో సాగు చేసి ఎకరాకు సుమారు 10 టన్నుల దిగుబడి సాధించి వినూత్న వ్యవసాయానికి ఆయన ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రి లోకేశ్, మాధవ్ మొక్కలు నాటారు. ఉద్యానరంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు