Youngsters Create Humgama: టవర్ ఎక్కి యువకుడి హల్ చల్.. చివరికి ఏమైందంటే..

ABN, Publish Date - Sep 30 , 2025 | 06:47 PM

శివాని అనే వ్యక్తి గురవరాజుపల్లిలోని పంట పొలాల్లో ఉన్న టవర్ ఎక్కాడు. అది గమనించిన స్థానికులు అతడ్ని కిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు కూడా చాలా ప్రయత్నించారు.

తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి టవర్‌పై నుంచి దూకి చనిపోయాడు. కర్ణాటకకు చెందిన శివాని అనే వ్యక్తి గురవరాజుపల్లిలోని పంట పొలాల్లో ఉన్న టవర్ ఎక్కాడు. అది గమనించిన స్థానికులు అతడ్ని కిందకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులు కూడా చాలా ప్రయత్నించారు. టవర్ పైకి ఎక్కితే కిందకు దూకుతాడేమోనని పైకి ఎక్కకుండా ఆగిపోయారు. కిందకు దూకితే కాపాడటానికి వలను ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి తర్వాత అతడే కిందకు దూకాడు. తీవ్ర గాయాలపాలై చనిపోయాడు.


ఇవి కూడా చూడండి

మూసీ ఉగ్రరూపం..20 నిమిషాల్లోనే మునిగిన ఇళ్లు

ధన వృద్ధికి ఏ దేవతారాధన ఉత్తమం

Updated at - Sep 30 , 2025 | 06:47 PM