Hyderabad: కేదార్ చుట్టూ తెలంగాణ రాజకీయం.. నెక్ట్స్ ఏం జరిగేనో..

ABN, Publish Date - Feb 27 , 2025 | 05:25 PM

Producer Kedar Passed Away, Kedar Death, Tollywood Celebrities, Telangana Politicians, Telangana Politics, Dubai

హైదరాబాద్, ఫిబ్రవరి 27: సినీ నిర్మాత కేదార్ చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. దుబాయ్‌లో ఉన్న కేదార్ సెలగం శెట్టి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఫిబ్రవరి 25న తన ఫ్లాట్‌లో నిద్రలోనే చనిపోయారు కేదార్. దీంతో ఆయన మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మూడు రోజులైనా కేదార్ మృతదేహం ఇండియాకు తీసుకురాలేదు. కేదార్ మృతిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు కోరితే కేదార్ మృతిపై దర్యాప్తు జరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదిలాఉంటే.. గత ఏడాది ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో కేదార్ అరెస్ట్ అయ్యారు. ఆనంద్ దేవరకొండ నటించిన గం గం గణేశా చిత్రానికి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు కేదార్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌తో కేదార్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. షకీల్ సైతం ప్రస్తుతం దుబాయ్‌లోనే ఉంటున్నారు. సెలబ్రిటీలకు, ఇతర రాజకీయ ప్రముఖలకు దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొనుగోళ్లు, ఇతర వ్యాపారల్లో మధ్యవర్తిగా కేదార్ వ్యవహరించేవాడని టాక్. ఈ క్రమంలో కేదార్ హఠాన్మరణం.. పలు అనుమానాలకు తావిస్తోంది.

Updated at - Feb 27 , 2025 | 05:25 PM