మిర్చి ధర పతనంపై రాజుకున్న రాజకీయ రగడ..
ABN, Publish Date - Feb 22 , 2025 | 08:25 AM
గుంటూరు మిర్చి యార్డును వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సందర్శించడంతో మిర్చి రేటు పతనం వ్యవహారం రాజకీయంగా పీక్ స్టేజ్‌కి చేరింది. ఈ అంశంపై జగన్ మాటలు మంటలు రేపాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇప్పుడు మిర్చి రైతుల (Chilli Farmers) కష్టాలపై రాజకీయ దుమారం రేగుతోంది. ధర పతనం రాజకీయంగా ఘాటెక్కిస్తోంది. అధికార, ప్రతిపక్షాల విమర్శలు మరింత మంటపుట్టిస్తున్నాయి. గుంటూరు మిర్చి యార్డు (Guntur Mirchi Yard)ను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సందర్శించడంతో రేటు పతనం వ్యవహారం రాజకీయంగా పీక్ స్టేజ్‌కి చేరింది. ఈ అంశంపై జగన్ మాటలు మంటలు రేపాయి. తానేదో రైతు జనోద్దారకుడు అన్నట్లు సీన్ క్రియేట్ చేశారు జగన్. వైసీపీ ప్రభుత్వంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి జగన్ పెట్టిన బకాయిలను కూటమి సర్కార్ చెల్లించింది. అలాగే వరికి సైతం మద్దతు ధర ఇవ్వలేదనే విషయాన్ని జగన్ మర్చిపోయినట్లు ఉన్నారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.
Updated at - Feb 22 , 2025 | 08:25 AM