వల్లభనేని వంశీకి విచారణ భయం...
ABN, Publish Date - May 25 , 2025 | 07:40 AM
Vallabhaneni Vamshi: 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ పట్టాలు పంపిణీ చేశారంటూ వంశీపై కేసు నమోదైంది. నూజివీడు కోర్టులో హాజరుపర్చగా ఈనెల 29 వరకు రిమాండ్ విధించారు.
అమరావతి: వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)కి విచారణ (Investigation) భయం పట్టుకుంది. పోలీసుల విచారణలో భాగంగా పలుమార్లు వంశీ అస్వస్థతకు (Health issues) గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిల్లా జైల్లో ఉన్న పీఎస్సార్ ఆంజనేయులు (PSR Anjaneyulu) కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కూడా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పేద ప్రజలకు నకిలీ పట్టాలు పంపిణీ చేశారంటూ వంశీపై కేసు నమోదైంది. నూజివీడు కోర్టులో హాజరుపర్చగా ఈనెల 29 వరకు రిమాండ్ విధించారు. అయితే తనకు అనారోగ్యంగా ఉందని శ్వాస తీసుకోడానికి ఇబ్బందిగా ఉందని జడ్జికి వంశీ వివరించారు. దీంతో పరిశీలించిన న్యాయాధికారి వంశీకి ఎప్పుడు అవసరమైనా ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాలని ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
Updated at - May 25 , 2025 | 07:40 AM