చీపురు, చాటలతో కొట్టుకున్న ప్రజలు..

ABN, Publish Date - Nov 09 , 2025 | 04:31 PM

ఖానాపూర్‌లో ప్రజలు వింత ఆచారం నిర్వహించారు. చిన్నా, పెద్దా అంతా కలిసి పాత దుస్తులు ధరించి పాత చీపురులు, చాటలతో కొట్టుకున్నారు. జెట్టక్క వెళ్లిపో.. లక్ష్మీదేవి రా అంటూ నినాదాలు చేశారు.

నిర్మల్: ఖానాపూర్‌లో ప్రజలు వింత ఆచారం నిర్వహించారు. చిన్నా, పెద్దా అంతా కలిసి పాత దుస్తులు ధరించి పాత చీపురులు, చాటలతో కొట్టుకున్నారు. జెట్టక్క వెళ్లిపో.. లక్ష్మీదేవి రా అంటూ నినాదాలు చేశారు. జెట్టక్క తొలగిపోతే ప్రజలంతా సుఖసంతోషాలతో జీవిస్తారంటూ స్థానికులు నమ్ముతారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరిగి ఆరోగ్యవంతులు అవుతారని విశ్వసిస్తారు. ప్రతి ఐదేళ్లకోసారి వీడీసీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, ఈ వింత ఆచారాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు సైతం పెద్దఎత్తున తరలివచ్చారు.

Updated at - Nov 09 , 2025 | 04:31 PM