ప్రధాని మోదీపై యుద్ధానికి సిద్ధం: సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Feb 14 , 2025 | 06:25 PM
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీది బీసీ కులం కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సంచలన కామెంట్లు చేశారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీది బీసీ కులం కాదని, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటూ సంచలన కామెంట్లు చేశారు. 2002 వరకూ ఆయనది ఉన్నత వర్గమేనని, గుజరాత్ (Gujarat) సీఎం అయ్యాక మోదీ తన కులాన్ని బీసీల్లో కలిపేసుకున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. అన్నీ తెలుసుకునే ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
Updated at - Feb 14 , 2025 | 06:25 PM