కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం..
ABN, Publish Date - Feb 22 , 2025 | 01:53 PM
నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద భారీ ప్రమాదం సంభవించింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఎడమవైపు సొరంగం పనులు జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.
నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (Srisailam Left Canal) టన్నెల్ వద్ద భారీ ప్రమాదం సంభవించింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట (Domalapenta) వద్ద ఎస్ఎల్బీసీ ఎడమవైపు సొరంగం (SLBC Left Tunnel) పనులు జరుగుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ(శనివారం) ఉదయం 8:30 గంటల సమయంలో కార్మికులు పనులు చేస్తుండగా మూడు మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో టన్నెల్‌లో 40 మంది కార్మికులు ఉన్నారు. సొరంగంలో రింగులు కిందపడి ప్రమాదం జరగగా.. విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోయింది. అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు రోజుల క్రితమే ఎడమవైపు సొరంగం పనులు మెుదలయ్యాయి.
Updated at - Feb 22 , 2025 | 01:53 PM