రన్యారావు కేసులో సంచలన విషయాలు..

ABN, Publish Date - Mar 12 , 2025 | 01:54 PM

నటి రన్యారవు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె పెంపుడు తండ్రి డీజీపీ రామచంద్రరావును విచారించాలని సీఎం సిద్ధ రామయ్య అధికారులను ఆదేశించారు. గోల్డ్ స్మగ్లింగ్‌కు సహకరించడంలో డీజీపీ పాత్రను తేల్చాలన్నారు.

బెంగళూరు: నటి రన్యారవు (Ranya Rao) గోల్డ్ స్మగ్లింగ్ కేసు (Gold Smuggling Case)లో సంచలన విషయాలు (Shocking Revelations) వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్ (Dubai)నుంచి బెంగలూరు (Bangalore)కు ఒక్క ట్రిప్‌లోనే కిలోల కొద్దీ బంగారం (Gold)ఎలా తెచ్చారన్న సందేహాలు మొదలవుతున్నాయి. ఎయిర్ పోర్టులో సెక్యూరిటీ లైన్ చాకచక్యంగా దాటుకోవడం ఒక ఎత్తు అయితే.. ఆమె బంగారాన్ని దాచి తేవడం మరో సంచలనమైంది. తన బెల్టు.. షూస్‌లో కిలోలకొద్ది బంగారాన్ని బెంగళూరుకు తీసుకువచ్చినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.

Also Read..:

దొంగలు తెలివిగా ఏం చేశారంటే..


మరోవైపు రన్యారావు పెంపుడు తండ్రి డీజీపీ రామచంద్రరావును విచారించాలని సీఎం సిద్ధ రామయ్య అధికారులను ఆదేశించారు. గోల్డ్ స్మగ్లింగ్‌కు సహకరించడంలో డీజీపీ పాత్రను తేల్చాలన్నారు. పోలీస్ ప్రోటోకాల్, కాన్వాయ్ ఏర్పాటు విషయంలో ఆమె తండ్రిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. విమానాశ్రయంలో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని హోంశాఖను సీఎం ఆదేశించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చే్యండి.


ఈ వార్తలు కూడా చదవండి..

గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ విమర్శలు

కేసీఆర్‌ను ఉద్దేశించి గవర్నర్ పరోక్ష కామెంట్స్

సీఐడీ విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి

For More AP News and Telugu News

Updated at - Mar 12 , 2025 | 01:54 PM