దారుణం.. వ్యాన్ బోల్తా పడి..

ABN, Publish Date - Jan 19 , 2025 | 07:04 PM

ఆదిలాబాద్: నార్నూర్(Narnoor) మండలం కొత్తపల్లి(Kothapalli) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) సంభవించింది. కొమురం భీం జిల్లాలోని జంగుబాయి జాతర(Jangubai Jatara)కు భక్తులతో వెళ్తున్న ఓ వ్యాన్ బోల్తా పడింది.

ఆదిలాబాద్: నార్నూర్(Narnoor) మండలం కొత్తపల్లి(Kothapalli) సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం(Road Accident) సంభవించింది. కొమురం భీం జిల్లాలోని జంగుబాయి జాతర (Jangubai Jatara)కు భక్తులతో వెళ్తున్న ఓ వ్యాన్ బోల్తా పడింది. ప్రమాదంలో 40మందికి గాయాలు కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. 108 వాహనానికి ఫోన్ చేసి రప్పించారు. దీంతో బాధితులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌, హైదరాబాద్‍కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. వ్యాన్ అదుపుతప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Updated at - Jan 19 , 2025 | 07:04 PM