ఎస్ఎల్‌బీసీ టన్నెల్.. కష్టంగా మారిన సహాయక చర్యలు..

ABN, Publish Date - Feb 25 , 2025 | 11:49 AM

నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి.

నాగర్ కర్నూల్: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యలు వేగంగా సాగడం లేదు. సహాయక బృందాలకు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కూలిన ప్రాంతం చాలాదూరంలో ఉండడంతో శకలాలు, మట్టిదిబ్బలు, బురద తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కావడం లేదు. సొరంగంలో ఇంకా 2.5 మీటర్ల మేర బురద అలాగే ఉండడంతో అక్కడ్నుంచి ఘటనా స్థలానికి నడవడం చాలా కష్టంగా మారింది. పైగా ఆదివారంతో పోలిస్తే ఊటనీరు మరింత పెరిగింది. ఇప్పటికే నిమిషానికి దాదాపు 3,500 లీటర్ల చొప్పున నీరు ఊరడంతో సహాయక చర్యలు మరింత కష్టంగా మారుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

పరీక్షల ముందు ఇలా చదవండి

Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్

Read Latest AP News And Telugu News

Updated at - Feb 25 , 2025 | 11:54 AM