నోటి మాటలే కాదు.. ఆధారాలు కూడా సమర్పించా..
ABN, Publish Date - Jun 09 , 2025 | 01:56 PM
Harish Rao: కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, నోటి మాటలే కాదు.. ఆధారాలు కూడా సమర్పించానని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కమిషన్ ఎదుట హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.
Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleswaram Project)పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) 40 నిముషాలపాటు మాజీ మంత్రి హరీష్‌రావు (Ex Minister Harish Rao)ను విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైన్, కార్పొరేషణ్ ఏర్పాటు కేబినెట్ అనుమతులపై హరీష్‌రావును కమిషన్ ప్రశ్నించింది. అనంతరం హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు.. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని, నోటి మాటలే కాదు.. ఆధారాలు కూడా సమర్పించానని చెప్పారు. కమిషన్ ఎదుట హాజరై రాజకీయాలు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు.
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌ను 7 ప్యాకేజీలుగా విభజించి.. గతంలో పనులు చేశారని, తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారని ప్రశ్నించారని, మహారాష్ట్రతో జరిపిన చర్చల మినిట్స్‌ను కూడా కమిషన్‌కు అందించానని హరీష్‌రావు తెలిపారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణానికి.. అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని..ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య 5, 6 సమావేశాలు జరిగాయని, ఎంత నష్టపరిహారమైనా ఇస్తామని స్పష్టంగా చెప్పినట్లు చెప్పానన్నారు. కేసీఆర్ స్వయంగా ముంబై వెళ్లి అడిగినా ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదని చెప్పినట్లు హరీష్‌రావు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి...
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 09 , 2025 | 01:56 PM