స్వర్ణాంధ్ర విజన్-2047 అండగా ఉంటా: ప్రధాని మోదీ..
ABN, Publish Date - Jan 08 , 2025 | 08:15 PM
స్వర్ణాంధ్ర విజన్-2047కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాలకు తామేప్పుడూ అండగా ఉంటామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
విశాఖ: స్వర్ణాంధ్ర విజన్-2047 (Swarnandhra Vision 2047)కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) లక్ష్యాలకు తామేప్పుడూ అండగా ఉంటామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. విశాఖ (Visakha) నగరంలో ఇవాళ (బుధవారం) ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేర్చేందుకు తానూ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజంభుజం కలిపి నడుస్తామని ఆయన చెప్పారు. అందుకే నేడు రూ.2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసినట్లు చెప్పుకొచ్చారు. 2030 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ చెప్పారు.
Updated at - Jan 08 , 2025 | 08:17 PM