రాష్ట్రపతికి స్వాగతం పలికిన ప్రధాని మోదీ..

ABN, Publish Date - Jan 31 , 2025 | 12:21 PM

ఢిల్లీ: బడ్జెట్-2025 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ (జనవరి 31)న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు మెుదలయ్యాయి. కాగా, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ఢిల్లీ: బడ్జెట్-2025 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ (జనవరి 31)న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు మెుదలయ్యాయి. కాగా, ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సమావేశాలు రెండు విడతల్లో నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు నిర్వహిస్తుండగా.. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకూ మలి విడత సమావేశాలు జరగనున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ భవనం వద్దకు వచ్చిన ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.

Updated at - Jan 31 , 2025 | 12:21 PM