పద్మ భూషణ్ రావడం గర్వకారణం: బాలకృష్ణ
ABN, Publish Date - Jan 31 , 2025 | 02:04 PM
హైదరాబాద్: పద్మ భూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పదవులు మనకు అలంకారం కాదని, మనమే ఆ పదవులకు అలంకారం కావాలని ఆయన చెప్పారు.
హైదరాబాద్: పద్మ భూషణ్ పురస్కారం రావడం సంతోషంగా ఉందని నందమూరి నటసింహం, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. పదవులు మనకు అలంకారం కాదని, మనమే ఆ పదవులకు అలంకారం కావాలని ఆయన చెప్పారు. పద్మ భూషణ్ పురస్కారం వచ్చిన సందర్భంగా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి టీమ్ బాలకృష్ణ దంపతులకు భారీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ దంపతులు పాల్గొన్నారు. బాలయ్య మాట్లాడుతూ.. ఈ అవార్డు తన క్షేమం కోరుకునే వారందరికీ వచ్చినట్లేనని చెప్పారు. నేడు ఈ అవార్డు తనకు వచ్చిందని రేపు మీకూ రావొచ్చంటూ ఆయన చెప్పుకొచ్చారు. సొంత లాభం కొంత మానుకుని సమాజం కోసం పని చేయాలని బాలకృష్ణ హితవు పలికారు.
Updated at - Jan 31 , 2025 | 02:04 PM