ఎమ్మెల్సీ కవిత వివాదం కీలక మలుపు
ABN, Publish Date - Jun 16 , 2025 | 08:56 AM
Kavitha controversy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఎమ్మెల్సీ కవితకు కొన్ని విషయాల్లో విబేధాలు తలెత్తాయి. వారసత్వ పోరు జరుగుతోందన్న ప్రచారం ఉంది. అన్నా.. చెల్లెలు వివాదం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
Hyderabad: బీఆర్ఎస్ (BRS)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వివాదం (controversy) కీలక మలుపు తిరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్ (KCR)ను కవిత దంపతులు (Kavitha Family) కలవడం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన అంశంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ సీపీ ఘోష్ కమిషన్ ఈ నెల 11న కేసీఆర్‌ను ప్రశ్నించింది. కేసీఆర్ కమిషన్ విచారణకు బయలుదేరబోయేముందు కవిత దంపతులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అయితే తండ్రికి నమస్కారం చేయడం వరకు కవిత పరిమితమయ్యారు.
కేటీఆర్‌తో కవితకు కొన్ని విషయాల్లో విబేధాలు తలెత్తాయి. వారసత్వ పోరు జరుగుతోందన్న ప్రచారం ఉంది. అన్నా.. చెల్లెలు వివాదం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఫామ్‌హౌస్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకపోయినా.. ఆయన కుమారుడు హిమాన్షు రావడం గమనించదగ్గ విషయం. అయితే మేనత్త, మేనల్లుడు కనీసం ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారా.. లేదా.. అనే అనుమానాలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 16 , 2025 | 08:56 AM