నా కొడుకు మరణంపై అనుమానాలున్నాయి.. పోలీస్ స్టేషన్‌కు గోపీనాథ్ తల్లి..
ABN , Publish Date - Nov 09 , 2025 | 08:38 AM
మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రెండు రోజుల ముందు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. తన కొడుకు మరణం వెనుక నిర్లక్ష్యం, సరిగా చూసుకోకపోవటంతో పాటు ఇంకేదో ఉందన్న అనుమానం కలుగుతోందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆస్పత్రిలో ఉన్నపుడు కుమారుడ్ని చూడ్డానికి తనకు అనుమతి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి చదవండి
‘అమ్మా... నా బ్యాగ్ ఎక్కడ?.. అమ్మా.. లంచ్‌కి ఏం చేస్తున్నావ్?..
వృద్ధురాలి హత్య.. రెండు రోజుల పాటు శవాన్ని ఇంట్లో పెట్టుకుని..