సిట్ విచారణకు విజయసాయి రెడ్డి
ABN, Publish Date - Apr 18 , 2025 | 10:27 AM
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విచారణ నిమిత్తం శుక్రవారం సెట్ అధికారుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఆయన విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి రానున్నారు.
అమరావతి: జగన్ (Jagan) హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం (Liquor Scam) దర్యాప్తు వేగాన్ని సెట్ (SIT) మరింత పెంచింది. కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) కోసం విస్తృతంగా గాలిస్తునే వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి (Mithun Reddy), మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)ని ప్రశ్నించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆ ఇద్దరికి మూడు రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అయితే ఒక రోజు ముందే గురువారం వస్తానని చెప్పిన విజయసాయి కోసం సెట్ అధికారులు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎదురు చూశారు. చివరి నిముషంలో విజయసాయి నుంచి మెసేజ్ వచ్చింది. ముఖ్యమైన పనులు ఉండం వల్ల రాలేకపోతున్నానని, శుక్రవారం తప్పకుండా హాజరవుతానని చెప్పారు. దీంతో ఇవాళ విజయసాయిని ప్రశ్నించనున్నారు. కాగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయవాడకు శుక్రవారం ఉదయమే చేరుకున్నారు. మరి కాసేపట్లో మద్యం కుంభకోణంపై జరిగే విచారణకు హాజరు కానున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి...
ఈ వార్తలు కూడా చదవండి..
పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్
పాస్టర్లకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..
For More AP News and Telugu News
Updated at - Apr 18 , 2025 | 10:27 AM