మహా కుంభమేళాకు ఆటోలో వెళ్లిన చిత్తూరు జిల్లా యువకులు

ABN, Publish Date - Feb 04 , 2025 | 09:50 PM

Kumbh Mela 2025: చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు యువకులు మహాకుంభమేళాకు ఆటోలో వెళ్లారు. జనవరి 27వ తేదీన కాణిపాకంలో శ్రీ వరసిద్ది వినాయకుడిని దర్శించుకొని ప్రయాగ్ రాజ్‌కు బయలుదేరారు. ఆటోలో వెనుక సీటు తొలగించి పరుపులు ఏర్పాటు చేసుకున్నామని వారు వివరించారు. ముగ్గురు పొడుకొని.. ఒకరు ఆటో నడిపే వారమని యువకులు తెలిపారు.

అమరావతి, ఫిబ్రవరి 04: చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు యువకులు మహాకుంభమేళాకు ఆటోలో వెళ్లారు. జనవరి 27వ తేదీన కాణిపాకంలో శ్రీ వరసిద్ది వినాయకుడిని దర్శించుకొని ప్రయాగ్ రాజ్‌కు బయలుదేరారు. ఆటోలో వెనుక సీటు తొలగించి పరుపులు ఏర్పాటు చేసుకున్నామని వారు వివరించారు. ముగ్గురు పొడుకొని.. ఒకరు ఆటో నడిపే వారమని యువకులు తెలిపారు.


24 గంటలు తమ ప్రయాణం సాగిందన్నారు. కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి.. వారణాసికి వెళ్లినట్లు చెప్పారు. కేవలం రూ.20 వేల ఖర్చుతో తాము ఈ ప్రయాణం చేశామన్నారు. ప్రస్తుతం ఈ యువకులు ఆటోలో ప్రయాణించిన వీడియోలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 04 , 2025 | 10:10 PM