కలర్ ఫుల్‌గా కైట్ ఫెస్టివల్..

ABN, Publish Date - Jan 14 , 2025 | 09:48 PM

హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌(Parade Grounds)లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ (International Kite and Sweet Festival) రెండో రోజు ఘనంగా కొనసాగింది. దేశ, విదేశాలకు చెందిన పతంగులు ఆకట్టుకున్నాయి.

హైదరాబాద్: నగరంలోని పరేడ్ గ్రౌండ్స్‌(Parade Grounds)లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ (International Kite and Sweet Festival) రెండో రోజు ఘనంగా కొనసాగింది. దేశ, విదేశాలకు చెందిన పతంగులు ఆకట్టుకున్నాయి. 19 దేశాలకు చెందిన కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు స్వీట్ ఫెస్ట్‌లో 130 రకాల మిఠాయిలు నోరూరించాయి. కైట్ ఫెస్టివల్ వీక్షించేందుకు భాగ్యనగర వాసులు భారీగా తరలివచ్చారు. సెలవలు కావడంతో చిన్నాపెద్దా అంతా పెద్దఎత్తున చేరుకున్నారు. ఈ ఫెస్టివల్‌లో వెరైటీ పతంగులు ఆకట్టుకున్నాయి. స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేశ్ (MLA Sri Ganesh) సైతం పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని పతంగులు ఎగరవేశారు.

Updated at - Jan 14 , 2025 | 09:49 PM