అలర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు..
ABN, Publish Date - Sep 02 , 2025 | 09:28 AM
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదారాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, ఈ రెండ్రోజులకు గానూ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
Updated at - Sep 02 , 2025 | 09:28 AM