AP Rains: ఏపీలో భారీ వర్షాలు.. జలదిగ్బంధంలో పలు గ్రామాలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 11:10 PM
ఏపీలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరదలు పెరుగుతున్నాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రహదారులు జలమయమై, కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఏపీలో ఈమధ్య భారీ వర్షాలు (AP Rains Update) బీభత్సంగా కురుస్తున్నాయి. వర్షాలు ఎడతెరిపిలేకుండా కురవడం వల్ల అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు నీటితో నిండిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉంది. మత్స్యకారులు సముద్రానికి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశాయి. అవసరం లేకుండా బయటకు రావొద్దని అధికారులు కోరుతున్నారు.