జనపనారతో పెళ్లి పత్రికలు జ్యూట్ బ్యాగుల్లో కొత్త ఆలోచన
ABN, Publish Date - Mar 09 , 2025 | 12:00 PM
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ కనపడుతోంది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ప్రమాదం. ఈ విషయం తెలిసిన కూడా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోలేకపోతున్నారు.
ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కనపడుతోంది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ప్రమాదం. ఈ విషయం తెలిసినా కూడా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోలేకపోతున్నారు. చిన్న కవర్ల దగ్గర నుంచి పెద్ద ప్లాస్టిక్ వస్తువుల వరకు అన్ని పర్యావరణానికి హాని చేసేవే. అయితే ఓ మహిళ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా నడుం బిగించింది. భర్తతో పాటు కొంతమంది మహిళల సాయంతో జ్యూట్ బ్యాగ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కేంద్రం ద్వారా పదిమందికి ఉపాధి కల్పిస్తోంది. జ్యూట్ బ్యాగ్స్ ఒక్కటే కాదు... పెళ్లిల్లో అతి ముఖ్యమైనదిగా భావించే వెడ్డింగ్ కార్డులను కూడా ఈమె ప్రింట్ చేయిస్తోంది. జనపనార నుంచి పెళ్లి పత్రికలు అందుబాటులోకి తీసుకురావడంతో కొత్తగా ఈమె ఆలోచనలను అంతా పొగుడుతున్నారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టుకు చెందిన ఉషారాణి ఉమెన్స్ డే రోజున స్పెషల్‌గా నిలిచారు. జ్యూట్ బ్యాగ్స్ కేంద్రం ద్వారా ఆమె డబ్బులు సంపాదించడమే కాకుండా కొంతమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.
Updated at - Mar 09 , 2025 | 12:01 PM