బాబోయ్.. కొత్త వ్యాధి.. ఇది సోకిందంటే..
ABN, Publish Date - Jan 26 , 2025 | 01:49 PM
పుణె: మహారాష్ట్ర(Maharashtra) ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్(GBS) ఆందోళన రేకెత్తిస్తోంది. అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ (Neurological Disorder)గా వైద్యులు దీన్ని చెబుతున్నారు.
పుణె: మహారాష్ట్ర(Maharashtra) ప్రజల్లో గులియన్ బారే సిండ్రోమ్ (GBS) ఆందోళన రేకెత్తిస్తోంది. అరుదైన న్యూరోలాజికల్ డిజార్డర్ (Neurological Disorder)గా వైద్యులు దీన్ని చెబుతున్నారు. పుణెలో చాలామందికి సోకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీని బారిన ఇప్పటికే 73 మంది పడగా.. 14 మందికి సీరియస్ ఉందని తెలిసింది. వారంతా వెంటిలేటర్‌పై చికిత్సపొందుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకూ జీబీఎస్ వల్ల ఎవ్వరూ చనిపోలేదు. కానీ, ప్రజలు అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడంతో మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Updated at - Jan 26 , 2025 | 01:49 PM