సద్గురు డ్యాన్స్‌కి ఫిదా అయిన జర్మనీ అమ్మాయి..

ABN, Publish Date - Feb 27 , 2025 | 07:43 AM

తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌(Coimbatore)లోని ఈశా యోగా కేంద్రంలో నిన్న (బుధవారం) మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిన్న ఉదయం అభిషేకాలు, దీపారాధనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు రాత్రి వరకూ సాగాయి.

కోయంబత్తూర్: మహాశివరాత్రి (Mahashivratri) సందర్భంగా ఈశా ఫౌండేషన్‌ (Isha Foundation) వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ (Sadhguru Jaggi Vasudev) ఘనంగా వేడుకలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్‌ (Coimbatore)లోని ఈశా యోగా కేంద్రంలో నిన్న (బుధవారం) మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నిన్న ఉదయం అభిషేకాలు, దీపారాధనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు రాత్రి వరకూ సాగాయి. కైలాసగిరుల నుంచి తెచ్చిన తీర్థంతో శివలింగానికి అభిషేకం చేయగా.. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అయితే శివరాత్రి సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఓ జర్మనీ అమ్మాయి ఆకట్టుకుంది. హిందూ మతం అంటే ఇష్టపడే ఆ యువతి.. నిన్న జరిగిన కార్యక్రమంలో పాల్గొంది. అక్కడ సద్గురు చేసిన నృత్యాలకు అంతా ఊగిపోగా.. సదరు జర్మనీ యువతి సైతం కాలు కదిపి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Gold and Silver Prices Today: బ్యాడ్ న్యూస్.. గోల్డ్ ధర ఎంతకు చేరిందంటే..

అద్భుతం.. చాక్‌పీస్ శివలింగాలు

Updated at - Feb 27 , 2025 | 07:44 AM