జైలు నుంచి యూన్‌ సుక్‌ యోల్‌ విడుదల

ABN, Publish Date - Mar 09 , 2025 | 01:15 PM

సియోల్‌:అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. దేశ రాజధాని సియోల్‌లోని న్యాయస్థానం ఆయన అరెస్టును రద్దుచేసిన నేపథ్యంలో యూన్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. అన్యాయాన్ని సరిచేస్తూ కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నానని యూన్‌ పేర్కొన్నట్టు ఆయన న్యాయవాదులు ప్రకటన విడుదల చేశారు.

సియోల్‌: అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు South Korea President) యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk-yeol) జైలు నుంచి విడుదలయ్యారు (Jail Release). దేశ రాజధాని సియోల్‌లోని న్యాయస్థానం ఆయన అరెస్టును రద్దు చేసిన నేపథ్యంలో యూన్‌కు నిర్బంధం నుంచి విముక్తి లభించింది. అన్యాయాన్ని సరిచేస్తూ కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నానని యూన్‌ పేర్కొన్నట్టు ఆయన న్యాయవాదులు ఓ ప్రకటన విడుదల చేశారు. గత డిసెంబరులో స్వల్పకాలం పాటు సైనిక పాలన విధిస్తూ యూన్‌ వెలువరించిన ఆదేశాలు దక్షిణ కొరియాలో పెను సంక్షోభాన్ని సృష్టించింది. ఆయనను పదవి నుంచి తొలగించాలా వద్దా అన్న విషయాన్ని రాజ్యాంగ న్యాయస్థానం పరిశీలిస్తోంది. ఆయన అభిశంసనను కోర్టు సమర్థిస్తే రెండు నెలల్లో దేశంలో ఎన్నికలు నిర్వహించి కొత్త అధ్యక్షునికి పట్టం కడతారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..:

అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి


ఈ వార్తలు కూడా చదవండి..

12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..

కొత్త వరవడిని సృష్టించిన ఎమ్మెల్యే కోటం రెడ్డి

రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ..

For More AP News and Telugu News

Updated at - Mar 09 , 2025 | 01:15 PM