మంచు మనోజ్, మంత్రి లోకేశ్ భేటీ.. విషయం ఇదే..

ABN, Publish Date - Jan 15 , 2025 | 03:37 PM

నారావారిపల్లె(Naravaripalle)లో మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)తో సినీ హీరో మంచు మనోజ్(Manchu Manoj) భేటీ అయ్యారు. ముందుగా మోహన్ బాబు కళాశాల వద్దకు మనోజ్ వెళ్లారు.

చిత్తూరు: నారావారిపల్లె(Naravaripalle)లో మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh)తో సినీ హీరో మంచు మనోజ్(Manchu Manoj) భేటీ అయ్యారు. ముందుగా మోహన్ బాబు కళాశాల వద్దకు మనోజ్ వెళ్లారు. అయితే అక్కడికి వచ్చేందుకు మనోజ్‌కు అనుమతి లేదంటూ, దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్లను పోలీసులు ఆయనకు అందజేశారు. దీంతో కాసేపు అక్కడంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనంతరం మనోజ్ అక్కడ్నుంచి నేరుగా నారావారిపల్లెకు చేరుకున్నారు. మంత్రి లోకేశ్‌తో సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన భేటీలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు.

Updated at - Jan 15 , 2025 | 03:38 PM