FASTag KYC Update: మీ ఫాస్ట్‌ట్యాగ్ నేటి నుంచి పనిచేయకపోవచ్చు!

ABN, Publish Date - Nov 01 , 2025 | 11:46 AM

ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. ఇవాళ్టి నుంచి మీ వ్యాలెట్ వాడకంలో ఇబ్బందులు రావొచ్చు. ఎందుకంటే, మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ అయి ఉండాలి..

ఇంటర్నెట్ డెస్క్: ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులకు ఒక ముఖ్య గమనిక. ఇవాళ్టి నుంచి మీ ఫాస్ట్‌ట్యాగ్ వ్యాలెట్ వాడకంలో ఇబ్బందులు రావొచ్చు. ఎందుకంటే, మీ ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ తప్పనిసరిగా కేవైసీ అప్డేట్ అయి ఉండాలి. లేకుంటే, ఆయా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థల ద్వారా జారీచేసిన ఫాస్ట్‌ట్యాగ్ లు నేటి నుంచి నిలిచిపోనున్నాయి.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం లేని, లేదా కేవైసీ వివరాలు అప్డేట్ చేయని ఫాస్ట్‌ట్యాగ్ లను నిలిపివేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. దీంతో సదరు ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లో డబ్బులు ఉన్నా ఉపయోగించుకోలేని పరిస్థితులు ఎదురుకావొచ్చు.


సాధారణంగా ఫాస్ట్‌ట్యాగ్ లేని వాహనాలకు రెట్టింపు ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది. దీనిని నివారించాలంటే, ఫాస్ట్‌ట్యాగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయి, నిర్ణీత గడువులోగా అవసరమైన కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

Updated at - Nov 01 , 2025 | 01:07 PM