ఎమ్మెల్యేపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి..

ABN, Publish Date - Jan 24 , 2025 | 01:44 PM

హనుమకొండ: కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామసభకు వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించారు.

హనుమకొండ: కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గ్రామసభకు వెళ్లిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లిస్ట్‌పై అధికారులను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన హస్తం పార్టీ శ్రేణులు ఆయనపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. కాగా, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడి చేశారు. ఈ నేపథ్యంలో అక్కడంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Updated at - Jan 24 , 2025 | 01:44 PM